Breaking News

ఇంటి వాడైన మరో భారత క్రికెటర్

0 0

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ ఓ ఇంటివాడయ్యాడు. రిన్నీ కంటారియా అనే న్యాయవాది యువతిని అతడు మంగళవారం పెళ్లాడాడు. గుజరాత్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఉనద్కట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘2021, ఫిబ్రవరి 2న మా వివాహం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. మాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. మా సరికొత్త జీవితం ఆరంభించేందుకు మీ ఆశీర్వాదాలు కావాలి’ అంటూ ఉనద్కట్ ట్వీట్ చేశాడు. కాగా జాతీయ జట్టులో స్థానం కోసం శ్రమిస్తున్న ఉనద్కట్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది కూడా RR తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు.