చండీగఢ్‌లోని ముల్లాన్ పూర్ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గిల్ సేన ఘన విజయాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో అదరగొట్టారు. మరోవైపు రిషభ్ పంత్ (81), సాయి సుదర్శన్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో 8 వికెట్లకు 564 పరుగుల స్కోరు వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో, ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లతో సత్తా చాటడంతో ఆఫ్ఘన్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఫాలో ఆన్‌లో కూడా ఆప్ఘనిస్తాన్ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ కంటే తక్కువ స్కోరు చేసింది. కేవలం 35.5 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో రెండున్నర రోజులకే టెస్టు మ్యాచ్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో ఆఫ్ఘన్ పతనాన్ని శాసించారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయాన్ని నమోదు చేసినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగం కాకపోవడమే కారణం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 48.15 శాతం పర్సంటేజీతో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.
