Breaking News

దుమ్మురేపుతున్న ‘పెద్ది’ ట్రైలర్

1 0

‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 18న ముంబైలోని జియో డ్రైవ్ మాల్‌లో ట్రైలర్ విడుదల చేయగా యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను.. మీరందరు నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారూ..’ అని చెర్రీ చెప్పిన డైలాగ్స్‌‌‌‌ సినిమాలోని డెప్త్‌‌‌‌ను తెలియజేస్తున్నాయి. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 63 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ (6 కోట్ల 30 లక్షల యూట్యూబ్ వ్యూస్) సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. తెలుగు ట్రైలర్కు యూట్యూబ్లో 2 కోట్ల 50 లక్షలకి పైగా వ్యూస్, అలాగే 43 లక్షలకి పైగా లైక్స్ దాటాయి. మరోవైపు హిందీలో 2 కోట్లకి పైగా వ్యూస్, తమిళంలో 38 లక్షలు, మలయాళంలో 24 లక్షలు, కన్నడలో 32 లక్షలకి పైగా వ్యూస్తో పెద్ది ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ కౌంట్ గంటగంటకు మారుతూ భారీ వ్యూస్ సాధిస్తుంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్​ కిలారు నిర్మించారు. రామ్‌చరణ్ సరసన తొలిసారిగా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది.