Breaking News

ఓటీటీలోకి అవతార్-3.. ఎప్పుడంటే..?

1 0

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. త్వరలో మరో మూడు సినిమాల వరకు విడుదల కానున్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన మూడో సినిమా అవతార్-ఫైర్ అండ్ యాష్ గత ఏడాది డిసెంబరు 19న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 24 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. థియేటర్లలో చూడనివారు ఓటీటీలో వీక్షించేందుకు ఇది అద్భుత అవకాశం అనే చెప్పాలి. అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా రెండో సినిమా అవతార్-ది వే ఆఫ్ వాటర్ మూవీకి కొనసాగింపుగా అవతార్-ఫైర్ అండ్ యాష్ తెరకెక్కింది. 2009లో అవతార్-1 విడుదల కాగా 14వేల కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022లో రెండో పార్ట్ కూడా రూ.18వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక మూడో పార్ట్ అనుకున్నంత సక్సెస్ సాధించకపోయినా 10వేల కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.