Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన ‘శ్రీనివాస మంగాపురం’

1 0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ సోదరుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘ శ్రీనివాస మంగాపురం’ . ఆర్ఎక్స్ 100 మూవీ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది. తాజాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. రిలీజైన 21 రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని వారు ఓటీటీలో అయినా వీక్షిస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. కాగా ఈ చిత్రంలో జయకృష్ణ సరసన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ నటించింది. అజయ్ భూపతి మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌ను మేళవించిన కథను తెరపై ఆవిష్కరించినా పెద్దగా సినీ ప్రియులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ అపజయానికి బాధ్యత తనదేనని దర్శకుడు ఒప్పుకోవడం గమనించాల్సిన విషయం.