ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారుతోంది. ఇప్పటికే 12 సెంచరీలు నమోదయ్యాయి. హాఫ్ సెంచరీలకు అయితే లెక్కే లేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు ఉర్విల్ పటేల్ వీరబాదుడితో రికార్డు నమోదైంది. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైన అర్థసెంచరీ నమోదు చేశాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జైస్వాల్ కూడా 13 బంతుల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు. ఇందులో ఒక ఫోర్, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఉంటే యువరాజ్ నెలకొల్పిన రికార్డును సమం చేసి ఐపీఎల్లో ఈ రికార్డు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచేవాడు. తాను ఎదుర్కొన్న 10వ బంతి డాట్ కావడంతో ఉర్విల్ పటేల్ ఈ రికార్డు అందుకోలేకపోయాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు:
యశస్వీ జైస్వాల్ – 13 బంతులు
రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (2023)
ఉర్విల్ పటేల్ – 13 బంతులు
చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (2026)
కేఎల్ రాహుల్ – 14 బంతులు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (2018)
ప్యాట్ కమిన్స్ – 14 బంతులు
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ (2022)
రొమారియో షెపర్డ్ – 14 బంతులు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (2025)
