Breaking News

ఈటీవీ ఖాతాలో రెండు పెద్ద సినిమాలు

1 0

ఒకప్పుడు ఒక సినిమా విడుదలైన 6 నెలల తర్వాతే టీవీలో ప్రసారం అయ్యేది. కానీ కాలం మారింది. ఇప్పుడు విడుదలై రెండు నెలల్లోనే సినిమాలు టీవీలో ప్రసారం అవుతున్నాయి. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా శాటిలైట్ హక్కులకు డిమాండ్ తగ్గింది. పలు ఛానళ్లు కూడా సినిమా హక్కుల కొనుగోళ్లను తగ్గించుకుని సొంత కార్యక్రమాలపై దృష్టి సారించాయి. ఇక ప్రముఖ ఛానల్ ఈటీవీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో ఈటీవీ చాలా లిమిటెడ్‌గానే సినిమా హక్కులను తీసుకుంటూ వస్తోంది. కానీ ఇటీవల సమ్మోహనం, బేబీ, మ్యాడ్, సైంధవ్, డెవిల్, హిట్-3 లాంటి భారీ బడ్జెట్ సినిమాల హక్కులను కొనుగోలు చేసి టీవీ అభిమానులను ఈటీవీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ మూవీ ఓజీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర హక్కులను ఈటీవీ కొనుగోలు చేసింది. దీంతో అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్లుగా ఈటీవీలో ప్రసారం కానున్నాయి. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 లాంటి సినిమాను మధ్యాహ్నం వేళ ప్రసారం చేసిన సదరు ఛానల్ తాజాగా కొనుగోలు చేసిన ఈ రెండు సినిమాలను ఏ టైంస్లాట్‌లో ప్రసారం చేస్తుందో అన్న విషయమే ఆసక్తికరంగా మారింది.