ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-2027 సైకిల్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించారు. ఐదుగురు సెంచరీలు చేసినా లోయరార్డర్ వైఫల్యం కనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు తక్కువ చేయడం టీమ్ కొంప ముంచింది. మరోవైపు చెత్త ఫీల్డింగ్ చేయడం కూడా ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసింది. ముఖ్యంగా జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు విడిచిపెట్టడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. అంతేకాకుండా బౌలింగ్‌లో అనుభవరాహిత్యం కూడా ఓటమికి కారణమైంది. బుమ్రా, సిరాజ్ కాకుండా ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ అంచనాల మేరకు రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా కూడా విఫలమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్ క్రికెట్ ఆడి భారత్ నుంచి మ్యాచ్ లాక్కున్నారు. ఈ సిరీస్‌లో ఇంకా నాలుగు టెస్టులు మిగిలి ఉన్నాయి. మరి భారత్ ఫీల్డింగ్, బౌలింగ్‌లో మెరుగుపడుతుందా లేదో వేచి చూడాలి.
