Breaking News

మరో సెంచరీ చేస్తే కోహ్లీ ప్రపంచ రికార్డు

1 0

గత ఏడాదిని ఒక్క సెంచ‌రీ కూడా లేకుండానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగించేశాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిని అత‌డు సెంచ‌రీతో ప్రారంభించాల‌ని ప్ర‌తి భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గబోయే సిరీస్‌లోనే ఆ సెంచ‌రీ పూర్తి చేయాల‌ని ఆశిస్తున్నారు. అదే జ‌రిగితే విరాట్ కోహ్లి ఓ వ‌ర‌ల్డ్ రికార్డును నెలకొల్పనున్నాడు. అది అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు. ఇప్ప‌టి వ‌ర‌కూ పాంటింగ్ 41 సెంచ‌రీల‌తో టాప్‌లో ఉన్నాడు. ఇప్పుడు పాంటింగ్‌తో స‌మానంగా ఉన్న కోహ్లి.. మ‌రో సెంచ‌రీ చేస్తే 42 సెంచ‌రీల‌తో రికార్డు సృష్టిస్తాడు. ఇంగ్లండ్‌తో టీమిండియా మొత్తం నాలుగు టెస్టులు ఆడ‌నుండగా.. ఈ శుక్ర‌వారం నుంచి మొద‌టి టెస్ట్ ప్రారంభం కానుంది.