Breaking News

బాక్సాఫీస్: ఒకేవారం ఆరు సినిమాలు.. టాక్ ఇదే..!!

1 0

టాలీవుడ్‌లో ఈ వారం సినిమాల హడావిడి నెలకొంది. ఒకేవారం ఆరు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు బరిలోకి దిగాయి. అయితే వీటిలో ఓ రెండు సినిమాలు మాత్రమే బజ్ సంపాదించుకున్నాయి. అవి తిరువీర్ నటించిన పాపం ప్రతాప్, హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరించిన తిమ్మరాజుపల్లి టీవీ. ఈ రెండూ ప్రమోషన్స్‌లో అదరగొట్టి ప్రారంభ వసూళ్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ నుంచి వచ్చిన పాపం ప్రతాప్ టీజర్, ట్రైలర్‌తో అందరిలోనూ ఆసక్తి రేపింది. అటు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తనటులతో తెరకెక్కిన తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అయితే ఈ రెండూ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర డెకాయిట్ తప్ప మరో మంచి సినిమా లేకపోవడంతో ఈ రెండు సినిమాలను అభిమానులు ఆదరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు నాగశౌర్య హీరోగా నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకు రివ్యూలు దారుణంగా వచ్చాయి. ఈ సినిమా కథ, కథనాలు అవుట్ డేటెడ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగశౌర్య హిట్ కోసం మరో సినిమా వరకు వెయిట్ చేయాల్సిందేనని ఈ సినిమా ఫలితం చెప్తోంది. అటు మలయాళం నుంచి అనువాదమైన పళ్లి చట్టంబి సినిమాకు కూడా టాక్ అంతంత మాత్రంగానే ఉంది. కథపరంగా బాగానే ఉన్నా మలయాళ నేటివిటీ తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మిగతా భాషల నుంచి వచ్చిన మిస్టర్ ఎక్స్, భూత్ బంగ్లా సినిమాలు కూడా మంచి రివ్యూలను సాధించలేకపోయాయి.