దేశంలోని సినిమా అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన మూవీ రౌద్రం, రణం, రుధిరం (ఆర్.ఆర్.ఆర్). ఈ సినిమా విడుదలై ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన నందమూరి అభిమానులు కాసింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించారని ఆవేదన పడుతున్నారు. పాత్రల పరంగా కూడా ఎన్టీఆర్ పాత్రకు టార్గెట్ తక్కువ చేసి చూపడంపై వారు కినుక వహించారు.
అయితే ఇలా ఎందుకు జరిగిందో ఒక్కసారి వెనక్కి వెళ్లిచూస్తే.. ఇందులో చిరంజీవి హస్తం ఉందని.. ఆయనే రామ్చరణ్ పాత్రను హైలెట్ చేసి చూపించాలని జక్కన్నకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది నిజమో.. కాదో పక్కన పెడితే.. రెండేళ్ల కిందట భీమ్ ఫర్ రామ్.. రామ్ ఫర్ భీమ్ టీజర్లు చూసిన వారికి ఓ విషయం మాత్రం అర్థమవుతోంది. ఆయా టీజర్లలో చూపించిన చాలా సన్నివేశాలు అసలు సినిమాలో లేవు. దీంతో కావాలనే రాజమౌళి తారక్ పాత్రను తక్కువ చేసి చూపాడని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సినిమాను మాత్రం కుటుంబ సమేతంగా కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇది మాత్రం గ్యారెంటీ.