Breaking News

బిగ్‌బాస్-6 రేటింగ్ దారుణంగా పడిపోయిందా?

1 0

తెలుగులో బిగ్‌బాస్ 6వ సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో మూడో వారం రన్నింగ్‌లో ఉంది. అయితే ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ముఖాలు లేకపోవడంతో బిగ్‌బాస్ ఎపిసోడ్లకు రేటింగ్ దారుణంగా వస్తోందని తెలుస్తోంది. సీజన్ సీజన్‌కు కూడా బిగ్‌బాస్ రేటింగ్ పడిపోతోంది. ప్రారంభ ఎపిసోడ్‌కు సంబంధించి ఈ సీజన్ అత్యంత చెత్త టీఆర్పీ నమోదు చేసింది. బిగ్ బాస్ సీజన్ 6 లాంఛింగ్ ఎపిసోడ్ కేవ‌లం కేవలం 8.86 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే సాధించింది. గత ఆరు సీజ‌న్‌లలో లాంఛింగ్ ఎపిసోడ్‌కు వ‌చ్చిన లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ఇదే.

ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌‌ లాంఛింగ్ ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ వచ్చింది. అటు నాని హెస్ట్ చేసిన రెండో సీజన్ ప్రారంభం ఎపిసోడ్‌ 15.05 రేటింగ్ సొంతం చేసుకుంది. నాగార్జున రంగంలోకి దిగి మూడో సీజన్‌కు 17.9 రేటింగ్ వచ్చింది.నాలుగో సీజన్ ప్రారంభ ఎపిసోడ్ 18.5 రేటింగ్‌తో అదరగొట్టింది.ఐదో సీజన్ కూడా 18 రేటింగ్‌తో సత్తా చూపించింది. అయితే అన్ని సీజన్ల కంటే నాలుగో సీజన్‌లో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే రికార్డులన్నీ బద్దలు కొట్టి 21.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కూడా 18.4 రేటింగ్ సాధించింది. ప్రస్తుతం హౌస్‌లో అరుపులు, కేకలు వినలేక ప్రేక్షకులు బిగ్ బాస్ చూడటమే మానేశారని టాక్ నడుస్తోంది. అటు బిగ్‌బాస్‌పై సీపీఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కాక రేపుతున్నాయి. నాగ్ కూడా వీటిని లైట్ తీసుకోకుండా నారాయణ.. నారాయణ అంటూ పంచులు వేస్తున్నాడు.