Breaking News

లక్షల నుంచి కోట్లకు ఎదిగిన బర్నింగ్ స్టార్

2 0

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అతడి నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. క్యాలీఫ్లవర్, బజార్ రౌడీ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బజార్ రౌడీ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కోసం మేకర్స్ ఏకంగా రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సంపూ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమట. ఇప్పటి వరకు రూ.లక్షల్లోనే సంపూ సినిమాలు పూర్తయ్యేవి. కానీ బజార్ రౌడీ సినిమాకు రూ.కోటి దాటి ఏకంగా మూడు కోట్ల ఖర్చు కావడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఈ మూవీకి థియేటర్ల రూపంలో కొంత… శాటిలైట్, ఓటీటీ రూపంలో మరికొంత వచ్చే అవకాశం ఉండటంతో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల బాట పడితే మాత్రం ఇకపై బర్నింగ్ స్టార్ మార్కెట్ 5 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా సంపూ పారితోషికం కూడా భారీగానే పెరిగే అవకాశాలు ఉంటాయి.