Breaking News

మీడియాపై దాడులు సరికావు

1 0

బోడుప్పల్: ఇటీవల Q న్యూస్ మీడియా గ్రూప్ పై జరిగిన దాడులు సరికావని Q న్యూస్ ప్రతినిధి నల్లమాస మనోజ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేయాలని పనిని సాటి జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న చేస్తున్నారని వారి పై చేసే దాడులు సరికావని ఆయన తెలిపారు. Q న్యూస్ పై దాడులు ఇలానే కొనసాగితే తెరాస పార్టీకి నష్టం జరుగుతుందే తప్ప మల్లన్న కు ఏం జరగదన్నారు. మల్లన్న ఎంతో మందికి న్యాయం చేస్తున్నారని ఆలాంటి వారిపై దాడులు సరికవాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకి సమస్య వస్తే సీఎం వద్దకు వెళ్ళాలి గానీ మల్లన్న వద్దకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. గతంలో చాలా మంది ముఖ్య మంత్రులు ప్రజాల సమస్యలను చెప్పుకుందేకు టైం ఇచ్చేదని, తమరు కూడా అదే విధంగా టైం ఇవ్వాలని కేసిఆర్ ని కోరారు. వెంటనే మల్లన్నపై చేస్తున్న కుట్రలను ఆపాలని అయన కేసిఆర్ ను విజ్ఞప్తి చేశారు.