Breaking News

ఈ సరికొత్త టీవీ ధర రూ.2లక్షలు

0 0

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ LG సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఓఎల్‌ఈడీ 48 CX పేరిట భారత మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ టీవీ ధరను రూ.1,99,999గా నిర్ణయించింది. గేమింగ్‌ ప్రియులు అద్భుతమైన సినిమా అనుభవాన్ని పొందాలనుకునే వారి కోసం దీన్ని రూపొందించినట్లు LG కంపెనీ వెల్లడించింది. ఎల్జీ ఓఎల్‌ఈడీ టెక్నాలజీని చిన్న టీవీల్లో కూడా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పాపులర్‌ CX వెర్షన్‌లో 55 అంగుళాల వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త టీవీ ఎనిమిది మిలియన్ పిక్సెల్స్‌ కలిగిన వాటికంటే అద్భుతమైన చిత్రాలను చూపిస్తుందని సంస్థ పేర్కొంది.