Breaking News

‘తగ్గేదే లే’ అంటున్న ‘పుష్ప’రాజ్.. ఫస్ట్ లుక్ టీజర్

1 0

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ టీజర్ వచ్చింది. ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఈ చిత్రంపై అంచాలను మరింత పెంచుతోంది.

అదేవిధంగా అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్టుగా పూర్తిగా గెటప్ మార్చేశారు. మరో వైపు టీజర్ చూస్తుంటే ఒకవైపు పోలీసులతో, మరోవైపు ప్రత్యర్థి ముఠాలతో పోరాటమే పుష్ప సినిమాల అర్థమవుతుంది. ముఖ్యంగా విజువల్స్‌ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. అంతే కాకుండా ఈ టీజర్‌లో హీరోయిన్ రష్మికను కూడా పరిచయం చేశాడు సుకుమార్.

లంగా, ఓణీలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందన్న లుక్ అదిరిపోయింది. ఇప్పటికే భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా తాజాగా విడుదలైన టీజర్‌తో ఆ అంచనాలను మరింత ఎక్కువయ్యేలా చేసింది. టీజర్ చూసిన అభిమానులు సైతం సుకుమార్ బన్నీ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు ఫాజిల్ ఫహాద్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.