Breaking News

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్

1 0

టెలివిజన్ కార్యక్రమాలకు ప్రాణం టీఆర్పీ రేటింగ్స్. వారం వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగుల వల్ల పలు టీవీల ర్యాంకులు మారిపోతుంటాయి. ఈ వారం (మార్చి 13-మార్చి 19) టీఆర్పీ రేటింగులను ఇప్పుడు చూద్దాం.

అటు ఈ వారం స్టార్ మా టీవీలో ప్రసారమైన ‘క్రాక్’ సినిమా 11.71 టీఆర్పీ సాధించింది. రవితేజ, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని టీవీ ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. ఈ సినిమాకు పోటీగా జెమినీ టీవీలో ప్రసారమైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా 6.72 టీఆర్పీ రేటింగ్ రాబట్టింది. జెమినీ టీవీ ఈ సినిమాను ప్రసారం చేయడం ఇది మూడోసారి. తొలిసారి రికార్డుస్థాయిలో 29.4 టీఆర్పీ రాబట్టిన బన్నీ సినిమా రెండోసారి టెలీకాస్ట్ సమయంలో 7.91 టీఆర్పీని రాబట్టింది.