Breaking News

అసలు ఆ కార్తీక్ గాడికి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?

0 0

ఇది నేను అంటున్న మాట కాదు. మాటీవీలో ప్రసారవుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ చూస్తున్న అభిమానులు అంటున్న మాట. జీతెలుగులో వచ్చిన ‘ముద్ద మందారం’ సీరియల్ లాగా ‘కార్తీక దీపం’ కూడా క్రమంగా టీఆర్పీ రేటింగుల్లో పడిపోతుంది. రేటింగులు మంచిగా ఉన్నప్పుడే ఈ సీరియల్‌ను నిర్వాహకులు ముగిస్తారన్న వదంతులు వట్టిదే అని ఈ మధ్య వస్తున్న ఎపిసోడ్లు స్పష్టం చేస్తున్నాయి. వంటలక్కను అనుమానించి దూరం పెట్టిన డాక్టర్ బాబు ఈ మధ్య పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని జనం మాట్లాడుకుంటున్నారు. సీరియల్ ముగింపు దశకు వచ్చిందని భావించిన అభిమానులకు డాక్టర్ బాబు ప్రవర్తన బొత్తిగా నచ్చడం లేదు. ప్రతి దానికి తుమ్మినా, దగ్గినా మోనిత దగ్గరకు వెళ్లడం.. ఆమె చెప్పిన మాట వినడం సరిపోతున్నాయి మన డాక్టర్ బాబుకి. డ్రైవర్ నిజం చెప్పినా, అమ్మ, పెళ్లాం నిజాలు నిగ్గు తేలుస్తున్నా ఆయన అసలు వినడం లేదు. దీంతో జనాలకు చిర్రెత్తుతోంది.

చివరకు మోనితే.. మోనిత గురించి చెడుగా చెప్పినా వినను అనే స్థాయికి దిగజారిన డాక్టర్ బాబు అసలు డాక్టర్ ఎలా అయ్యాడని జనాలు చీదరించుకుంటున్నారు. 1000 ఎపిసోడ్లకు చేరువ అవుతున్న ఈ సీరియల్‌లో కథ అంటూ ఏమీ లేకపోయినా దర్శకుడు జీడిపాకంలా సాగదీస్తున్నాడు. ఒక డాక్టర్ స్థాయిలో ఉండి తనకు పిల్లలు పుడతారా.. పుట్టరా అన్న విషయంపై పరీక్ష చేయించుకోలేని దద్దమ్మ డాక్టర్ బాబు అంటూ బుల్లితెర ప్రేక్షకులు తిట్టిపోస్తున్నారు. ఏదో సౌందర్య, వంటలక్క కోసం సీరియల్ చూస్తున్న అభిమానులు డాక్టర్ బాబు క్యారెక్టర్‌ను అసహ్యించుకునే స్థాయికి వచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలో 2040లో ‘కార్తీక దీపం’అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ సీరియల్‌లో నటిస్తున్న హిమ, శౌర్య చూస్తుండగానే పెద్దపిల్లలు అయిపోయారు. వాళ్లకు పెళ్లిళ్లు చేసేవరకు ఈ సీరియల్ ముగిసేలా అయితే కనిపించడం లేదు. మరి ఇప్పటికైనా నిర్వాహకులు స్పందించి సీరియల్‌ను ముగింపు దశకు తీసుకువెళ్తారో.. లేదో వేచి చూడాలి.