Breaking News

అఖిల్, మోనాల్ జంట అదిరిపోయిందిగా..

0 0

బిగ్‌బాస్‌లో ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్న అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ మూవీకి ‘తెలుగు అబ్బాయి-గుజరాత్ అమ్మాయి’ అనే టైటిల్ ఖరారు చేశారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.భాస్కర్ రావు నిర్మిస్తున్నారు. సరస్వతి క్రియేషన్స్ బ్యానరుపై ఈ మూవీ నిర్మితమవుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా తొలి పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొత్తానికి బిగ్ బాస్ ప్రేమజంటకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. టెలివిజన్ తెరపై మంచి కెమిస్ట్రీ పండించిన ఈ జంటను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.