సినిమాల్లో అవకాశాల కోసం ఓ టాలీవుడ్ నటి నీలి చిత్రాల్లో నటిస్తూ ఆ వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ అడ్డంగా బుక్కయింది. శ్రీకాంత్ నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ సిరీస్‌లలో ఐటమ్ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన గెహనా వశిష్ట.. అనంతరం టాలీవుడ్‌లో చేసిన మూడు, నాలుగు సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నీలిచిత్రాలు చేసి ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తోంది. వీటిని చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ కింద రూ.2వేలను వసూలు చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వెబ్ సైట్‌లో 87 నీలి చిత్రాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. వశిష్టతో పాటు ఆమెతో నీలి చిత్రాలను నిర్మిస్తున్న పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వశిష్ట.. ‘అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి’, ‘నమస్తే’, ‘బీటెక్ లవ్‌స్టోరీ’, ‘ఐదు’ వంటి తెలుగు సినిమాలలోనూ నటించింది.