Breaking News

ఈనెల 29న మెగాస్టార్ మూవీ టీజర్

0 0

‘ఆచార్య’ టీజర్ కోసం వెయిట్ చేస్తున్న మెగాస్టార్ అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్‌ను చిత్ర యూనిట్ అందించింది. రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ విడుదల కాకపోవడంతో వారు తీవ్రంగా నిరుత్సాహం చెందారు. దీంతో కొరటాల శివ అండ్ టీమ్ టీజర్ డేట్‌ను బుధవారం నాడు ప్రకటించింది. ఈనెల 29న శుక్రవారం నాడు సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో విడుదల చేసింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.