సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇటీవల సామ్ జామ్‌లోని నాగచైతన్య ఎపిసోడ్‌లోనూ సమంత స్వయంగా చెప్పింది. అయితే సోషల్ మీడియాలో సమంత లేటెస్ట్గా పెట్టిన ఓ ఫోటో విమర్శలకు తావిచ్చింది. సెలబ్రిటీలు అన్న తర్వాత పర్సనల్ లైఫ్‌కు సంబంధించి అన్ని విషయాలు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయంలో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారు. సమంత కూడా అదే కోవలోకి వచ్చిందనే చెప్పాలి. నాలుగేళ్ల క్రితం తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో సోఫాలో కూర్చుని నైట్ డ్రెస్సుల్లో ఉన్న ఫోటోను సమంత షేర్ చేసింది. అతడు ఎవరైనా, ఎలాంటి సంబంధం ఉన్నా సమంత ఈ ఫోటోను పబ్లిక్‌తో పంచుకోవడం దుమారం లేపింది. తన తప్పు తెలుసుకున్న సమంత వెంటనే ఫోటో డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. న్యూస్ మీడియాలో ఆమెపై అసభ్యకరమైన కామెంట్లు వినిపించాయి. చెత్త ఫోటోలు పెడితే నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో సమంతకు ఇప్పటికైనా బోధపడే ఉంటుంది.