బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ దారుణ ఫలితాన్ని చవిచూసింది. చెర్రీ కెరీర్లో ఇదో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనూహ్యంగా బుల్లితెరపై మాత్రం మంచి టీఆర్పీలను సాధిస్తోంది. ఈ సినిమాను స్టార్ మాలో ఇటీవల 17వ సారి ప్రసారం చేయగా 3.92 టీఆర్పీ సాధించింది. తొలిసారి 7.9, రెండో సారి 8.2, మూడోసారి 8.16, నాలుగోసారి 7.2, ఐదోసారి 8.18, ఆరోసారి 5.19, ఏడోసారి 6.35, 8వ సారి 7.97, 9వ సారి 7.55, 10వ సారి 7.51, 11వ సారి 7.68, 12వ సారి 5.98, 13వ సారి 5.12, 14వ సారి 4.37, 15వ సారి 5.41, 16వ సారి 5.21 టీఆర్పీలను ఈ చిత్రం సాధించింది. కాగా మహేష్ ‘అతడు’, ‘ఖలేజా’ కూడా అప్పట్లో వెండితెర కంటే బుల్లితెరపైనే ఎక్కువ ప్రేక్షకాదరణను పొందిన సంగతి తెలిసిందే.