Breaking News

రెండు రోజుల్లోనే ‘ఇరుముడి’ బ్రేక్ ఈవెన్

1 0

మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. ధమాకా తర్వాత హిట్ లేకుండా సినిమాలు చేస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఎట్టకేలకు రవితేజ ఖాతాలో అనుకోని బంపర్ హిట్ పడింది. ఆ మూవీనే ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలిరోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తిచేశారు. పాటలు, ప్రోమోలకు భారీగా స్పందన రావడంతో మంచి బిజినెస్ కూడా జరిగింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం రైట్స్‌ను 5.4 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు 7.35 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు బిజినెస్ వాల్యూ చేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల రైట్స్ సుమారుగా 15 కోట్లకుపైగానే అమ్ముడుపోయాయి. ఇక ఇతర రాష్ట్రాల రైట్స్‌ను 1.25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ విషయానికి వస్తే.. 4 కోట్ల రూపాయల మేర డీల్ క్లోజైంది. దాంతో ఈ సినిమా సుమారుగా 20 కోట్ల రూపాయల మేర వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది.

తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా రూ.47.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.36.45 కోట్ల గ్రాస్, రూ.31.40 కోట్ల నెట్ రాబట్టగా, ఓవర్సీస్‌లో రూ.11 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో రెండో రోజే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది. మొత్తంగా చూసుకుంటే ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం ‘ఇరుముడి’ కేవలం సూపర్ హిట్ సినిమా మాత్రమే కాదు.. రవితేజ మార్కెట్‌ను మళ్లీ బలోపేతం చేసిన కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. మరో విశేషం ఏంటంటే.. రెమ్యునరేషన్‌లో భాగంగా రవితేజ నైజాం రైట్స్ తీసుకోగా అతడికి సుమారు రూ.25 కోట్లు సొంతం అవుతాయని ట్రేడ్ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.