Breaking News

బిగ్‌బాస్-9 విజేతగా తనూజ.. ఇంత ఫేవరిజమా?

1 0

తెలుగులో బిగ్‌బాస్-9 11వ వారం కొనసాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, భరణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నారు. అయితే వీరిలో తనూజ కెప్టెన్‌గా ఉండగా.. సుమన్ శెట్టిని ఎవరూ నామినేట్ చేయలేదు. మరోవైపు 10 వారాల తర్వాత తొలిసారి ఇమ్మూ నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇమ్మూకి ఓటింగ్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ సరళిని చూస్తుంటే సంజన, దివ్య డేంజరస్ పొజిషన్‌లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బిగ్‌బాస్ విన్నర్‌గా తనూజ, ఇమ్మూ, కళ్యాణ్ పోటీ పడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. వీరిలో తనూజకు స్టార్ మా నుంచి సపోర్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా హోస్ట్ నాగార్జునతో మొదలు బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ తనూజకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్లు కూడా తనూజ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇమ్మూని మినహాయిస్తే మిగతా అందరూ తనూజ తాన అంటే తందాన అంటున్నారు.

వీకెండ్ ఎపిసోడ్లలో మిగతా వాళ్ల పట్ల నాగ్ కఠినంగా వ్యవహరిస్తుంటే తనూజ విషయంలో మాత్రం ఫేవరిజం చూపిస్తూ మృదువుగా ఉంటున్నాడు. అందరితో పచ్చిమిరపకాయలు తినిపించిన నాగ్.. తనూజ విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చి గుంజీలు మాత్రమే తీయించాడు. దీంతో తనూజ పట్ల ఫేవరిజం బయటపడిపోవడంతో విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్ విజేతగా తనూజ ఖాయమైందని.. ఇంకా మిగతావాళ్లు ఎంత బాగా ఆడినా ప్రయోజనం లేదని నెట్టింట అందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇమ్మూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుండటంతో అతడు విన్నర్ కావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే బిగ్‌బాస్-9 విజేత ఎవరో తెలియాలంటే మరో నాలుగు వారాలు వెయిట్ చేయాల్సిందే.