టాలీవుడ్ వర్సటైల్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభన్‌బాబు తరహాలో ఫ్యామిలీ హీరోగా అందరి ప్రశంసలు అందుకున్న ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకుంటున్నాడు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇప్పుడు మూడో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించాడు. జీ ఛానల్ కోసం జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జునను అతిథిగా ఆహ్వానించిన జగపతిబాబు.. తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించి ఒక ఆటాడుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో నాగార్జున బ్యానర్ నిర్మించిన ‘ఆహా’ సినిమాలో నటించిన జగపతిబాబు వ్యక్తిగతంగా నాగ్ సోదరుడు వెంకట్‌కు మంచి స్నేహితుడు. అందుకే ఈ ఎపిసోడ్‌లో నాగ్ సోదరుడు వెంకట్, సోదరి నాగసుశీలను కూడా ఆహ్వానించి తనతో సాన్నిహిత్యాన్ని బయటపెట్టాడు. తాజాగా సెకండ్ ఎపిసోడ్‌లో హీరోయిన్ శ్రీలీలను ఇంటర్వ్యూ చేసి వినోదాన్ని పంచనున్నాడు. ఇప్పటికే విడుదలైన శ్రీలీల ఎపిసోడ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా చూస్తే సెలబ్రిటీలతో ఫ్రెష్ లుక్‌లో జగపతిబాబు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ముచ్చట్లు బాగున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.
