Breaking News

బిగ్‌బాస్-9 అగ్నిపరీక్ష.. కళ్లన్నీ అభిజిత్ వైపే..!!

1 0

దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఏ భాషలో అయినా బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం అవుతుందంటే ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా తెలుగులో 9వ సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ సీజన్‌లో కామన్ పీపుల్‌కు స్థానం కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో భారీగా కామన్ పీపుల్ ఈ షో కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 20వేల మంది అప్లై చేసుకోగా వారిలో 200 మందిని నిర్వాహకులు ఎంపిక చేశారు. మళ్లీ స్క్రూటినీ ద్వారా 40 మందిని వడపోసి చివరకు 15 మందిని అగ్నిపరీక్షకు ఫైనల్ చేశారు. వీరిలో నలుగురిని లేదా ఐదుగురిని బిగ్ బాస్ 9వ సీజన్‌కు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 15 మందికి అగ్నిపరీక్ష జరుగుతుండగా వీరిని ఎంపిక చేసే బాధ్యత గత సీజన్‌లలో విజేతలుగా నిలిచిన బిందు మాధవి, అభిజిత్‌లతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిలో నాలుగేళ్ల తర్వాత అభిజిత్ బుల్లితెరపై కనిపించనుండటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష జియో హాట్ స్టార్‌లో ప్రతిరోజూ స్ట్రీమింగ్ కానుంది.