Breaking News

భారీ రిస్క్ చేస్తున్న ‘కన్నప్ప’

0 0

టాలీవుడ్‌లో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణుకు మార్కెట్ అంతంత మాత్రమే. పదుల సంఖ్యలో సినిమాలు చేసినా ఇప్పటి వరకు రెండు లేదా మూడు హిట్లు మాత్రమే అతడి ఖాతాలో ఉన్నాయి. ఢీ, దేనికైనా రెడీ తప్పితే మంచు విష్ణు పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సినిమాలు ఉండవు. ఈ నేపథ్యంలో కన్నప్ప అనే సినిమాను భారీ బడ్జెట్‌తో మంచు విష్ణు చేస్తున్నాడని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమా కోసం విష్ణు దాదాపు రూ.200 కోట్లు ఖర్చుపెట్టాడు. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులోకి ప్ర‌భాస్‌, మోహ‌న్ లాల్‌, అక్ష‌య్ కుమార్‌, కాజ‌ల్ లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారో అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. టీజర్ వచ్చిన తర్వాత హైప్ కూడా పెరిగింది. ఈనెల 27న విడుదలవుతున్న ఈ మూవీ హిట్ కావాలంటే ప్ర‌భాస్ ఫ్యాన్స్ కీలకం. ఒకవేళ ప్ర‌భాస్ పాత్ర రెబల్ అభిమానుల‌కు న‌చ్చితే మంచు విష్ణు పంట పండిన‌ట్లే అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఓటీటీ హక్కులు కూడా విక్రయించలేదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే పెట్టిన ప్రతిపైసా వస్తుందని మంచు విష్ణు ధీమాగా కనిపిస్తున్నాడు. అందుకే రిస్క్ చేసి చాలా చోట్ల సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. వాస్తవానికి సినిమా విడుదలకు ముందు ప్రభాస్‌తో ఓ కామ‌న్ ఇంట‌ర్వ్యూ చేసి బ‌య‌ట‌కు వ‌దులుదామని మేకర్స్ భావించారు. కానీ అది కుద‌ర్లేదు. దీంతో ఎలాంటి ప్రమోషన్ లేకుండానే కన్నప్పను రిలీజ్ చేయబోతున్నారు.