Breaking News

బిగ్‌బాస్-8: టేస్టీ తేజ తుంటరి పని.. వెక్కి వెక్కి ఏడ్చిన నయని..!!

1 0

బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ క్రమక్రమంగా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్లలో గొడవలు ప్రారంభం అయ్యాయి. టేస్టీ తేజ తుంటరి పని కారణంగా నయని పావని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అసలు ఏం జరిగిందంటే.. జబర్దస్త్ అవినాష్‌తో సీజన్4 గురించి కిర్రాక్ సీత డిస్కషన్ పెట్టింది. ఇంతలో నయని పావని అక్కడికి వచ్చింది. వారికి ఎదురుగా టేస్టీ తేజ, మెహబూబ్ ఉంటారు. సీజన్ 4లో నయని తొలివారమే ఎలిమినేట్ కావడంతో ఎవరు నామినేట్ చేశారని ఆమెను సీత అడుగుతుంది. అయితే తనను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడని నయని చెప్తుంది. తాను పనిచేయలేదని ప్రశాంత్ తనను నామినేట్ చేశాడని.. కానీ ఆరోజంతా తాను పనిచేశాను కదా అంటూ టేస్టీ తేజను అడుగుతుంది. అయితే నువ్వు హండ్రెడ్ పర్సంట్ ఇవ్వలేదని.. అందుకే ఆడియన్స్ నిన్ను నామినేట్ చేశారని.. బయట రివ్యూవర్లు బండబూతులు తిట్టారని టేస్టీ తేజ నోరు జారతాడు. కావాలంటే వెళ్లి చూసుకో అని తేజ కాస్త రూడ్‌గానే మాట్లాడతాడు. కాసేపు సైలెంట్‌గా ఉన్న నయని ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. అవినాష్, సీత, మెహబూబ్ ఏమైందని ఆరా తీస్తారు. కానీ నయని బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన బెడ్‌మీదకు వెళ్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. మెహబూబ్, యష్మీ వచ్చి ఓదారుస్తారు. తాను మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాననే బాధ సంవత్సరంపాటు పడ్డానంటూ నయని ఆవేదన వ్యక్తం చేస్తుంది.