Breaking News

బాల‌య్య సినిమాకు టైటిల్.. హడావిడి మాములుగా లేదుగా..!!

1 0

ఈ ఏడాది వీర‌సింహారెడ్డి మూవీ హిట్‌తో సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌య్య మంచి ఊపులో క‌నిపిస్తున్నాడు. సంక్రాంతి త‌ర్వాత ద‌స‌రాకు మ‌రో సినిమాతో బ‌రిలోకి దిగ‌బోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన 108వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ సినిమాకి టాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈనెల 10న బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈనెల 8న ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌బోతున్నారు. టైటిల్ రివీల్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో 108 ప్రదేశాల్లో 108 భారీ హోర్డింగ్స్‌ను భారీ ఎత్తున‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రేంజ్‌లో టైటిల్ రివీల్ చేయ‌డం టాలీవుడ్‌లో ఇదే తొలిసారి అని ప‌లువురు చెప్పుకుంటున్నారు. మొత్తానికి టైటిల్‌తోనే బాల‌య్య‌-అనిల్ రావిపూడి మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీకి భ‌గ‌వ‌త్ కేస‌రి అనే టైటిల్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా కాజల్ .. ఆయన కూతురుగా శ్రీలీల కనిపించనున్నారు. వ‌రుస‌గా బాల‌య్య మూడో మూవీకి కూడా త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. గ‌త రెండు చిత్రాలు అఖండ‌, వీర‌సింహారెడ్డి సినిమాల‌కు కూడా త‌మ‌న్ మ్యూజిక్ అందించిన సంగ‌తి తెలిసిందే.