Breaking News

‘సింహాద్రి’ రీరిలీజ్ రికార్డులన్నీ తిరగరాస్తాడా?

2 0

టాలీవుడ్‌లో గత ఏడాది నుంచి రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పోకిరి సినిమా ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు అయితే కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్‌లు వసూలు చేశాయి. అయితే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఒక్కటి కూడా రీరిలీజ్ కాలేదు. నందమూరి అభిమానుల ఆకలి తీర్చేందుకు తాజాగా ఎన్టీఆర్- రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ఈనెల 20న సింహాద్రి మూవీని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాల్లో పోకిరి, జల్సా, ఆరెంజ్ సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాయి. మరి ఎన్టీఆర్ వాళ్ల వసూళ్లను క్రాస్ చేసి తన మాస్ ఇమేజ్ నిరూపించుకుంటాడో లేదో చూడాల్సిందే. అప్పట్లో 191 కేంద్రాల్లో 50 రోజులు నడిచిన సింహాద్రి మూవీ 154 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది .అంతేకాకుండా ఏకంగా 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు పైగా నడిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.