హైదరాబాద్‌లో సినిమా తరహా భారీ సెట్టింగ్స్‌లో ‘లూయిస్ పార్క్’ యాడ్ షూటింగ్
కమర్షియల్ యాడ్స్‌లో దూసుకుపోతున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్
భారత దేశంలో తొలిసారిగా ఏపీ తెలంగాణలో లాంచ్ కానున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్ ‘లూయిస్ పార్క్’
యాంకర్ రవి, జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లకు ఉన్న క్రేజ్‌ను అడ్వర్టైజింగ్ కంపెనీలు కూడా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వారితో ప్రత్యేకంగా ప్రకటనలు రూపొందిస్తున్నాయి. కట్ చేస్తే.. గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్తో వస్తున్న గొప్ప బ్రాండ్ ‘లూయిస్ పార్క్’. ఈ బ్రాండ్‌ను భారత దేశంలోనే మొదటిసారి ఏపీ, తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు. హైదరాబాద్‌లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి ‘లూయిస్ పార్క్’ యాడ్ షూటింగ్ జరుపుతున్నారు.
ఈ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్‌కు యాడ్స్ కింగ్ మేకర్ సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్‌కు రైటర్‌గా చేసిన సుభాష్ కెమెరామెన్‌గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్‌ను విస్తృతస్థాయిలో ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెడుతున్నారు. త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ ‘లూయిస్ పార్క్’ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లలో బ్రాంచీలను ఓపెన్ చేయనున్నారు.