Breaking News

బుక్‌ మై షోలో దుమ్మురేపుతోన్న ‘ఖుషి’

1 0

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఖుషి సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పవన్ ఏడో సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచనాలు క్రియేట్ చేసింది. 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఈ సినిమాను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి చిత్రాలను రిలీజ్ చేయగా.. ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఖుషి సినిమాను న్యూ ఇయర్ స్పెషల్ అంటూ డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతోన్నారు. దీంతో పవర్‌స్టార్ అభిమానుల్లో ఇప్పుడే సంబరాలు మొదలయ్యాయి.

బుక్ మై షోలో ఈ సినిమా టిక్కెట్లను విడుదల చేయగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఖుషి సినిమా దెబ్బకు ఇటీవల భారీ ఎత్తున రిలీజైన అవతార్-2 సినిమా కూడా కుదేలవుతోంది. బుక్ మై షో ట్రెండింగ్‌లో ఖుషి సినిమా ఉండటంతో పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క ప్రకటనతో ఈ స్థాయిలో ఖుషి సినిమాకు క్రేజ్ నెలకొని ఉండటంతో మిగతా స్టార్ల ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. ఒకప్పుడు ఖుషి టికెట్ల కోసం ఎంతగా పడిగాపులో కాశారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశాలున్నాయి.