Breaking News

షాకిచ్చిన బిగ్‌బాస్… హౌస్ నుంచి వెళ్లిపోయిన జెస్సీ

1 0

బిగ్‌బాస్‌ 5లో ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ.. మంగళవారం నాడు హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజులుగా జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వర్టిగో సమస్య ఉన్న వారికి చూపు మందగించడం, చెవులు సరిగ్గా వినిపించక పోవడం, ఎక్కువ సేపు నిలబడటం సేఫ్ కాదు. సోమవారం ఎపిసోడ్‌లో సైతం జెస్సీ అస్వస్థతకు గురవగా అతడిని సీక్రెట్‌ రూంలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే అతడి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జెస్సీని బిగ్‌బాస్ బయటకు పంపించేశాడు. దీంతో అతడి స్నేహితులు షణ్ముఖ్, సిరి కన్నీటి పర్యంతం అయ్యారు. గ‌త సీజన్‌లో కూడా గంగవ్వకి హెల్త్ ప్రాబ్లమ్ రావ‌డంతో ఆమెను షో మ‌ధ్య నుంచే ఎలిమినేట్ చేసేశారు. అలాగే నోయల్ కూడా హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే ఇంటి నుంచి బయటకి వచ్చేశాడు.

https://twitter.com/StarMaa/status/1458022978336092164