Breaking News

అఫీషియల్: నాగచైతన్య-సమంత విడాకులు ఖరారు

0 0

ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యాయి. టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. సమంత, తాను విడిపోతున్నట్లు ఓ పోస్టులో పేర్కొన్నాడు. ఇదే పోస్టును ఇన్‌స్టాగ్రమ్‌లో సమంత కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే… ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ఉంది. కాగా నాగచైతన్య, సమంత కలిసి ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించారు. ఏ మాయ చేశావె, మనం, ఆటో నగర్ సూర్య, మజిలీ చిత్రాల్లో వీరిద్దరూ జోడీగా నటించారు.