బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ రవి ప్రతి విషయంలో అమాయకపు ఫేస్ పెట్టి మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు. నామినేషన్స్ సందర్భంగా ప్రియా, లహరి విషయంలో యాంకర్ రవి అతి చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ వీడియో ద్వారా బయటపెట్టాడు. బాత్రూమ్ దగ్గర లహరిని హగ్ చేసుకున్న ఇష్యూలో తప్పంతా ప్రియాదే అన్నట్లు రవి కవరింగ్ చేశాడు. హాలులో, బెడ్ రూంలో ఎలాగైతే నార్మల్‌గా హగ్ చేసుకున్నామో అక్కడ కూడా లహరిని తాను అలాగే చేసుకున్నానంటూ నొక్కి చెప్పాడు.
దీంతో నాగార్జున ఈ ఇష్యూలో రవి తొండి ఆటని కళ్లకు కట్టినట్టు లహరికి చూపించాడు. పవరూంలోకి లహరిని పిలిచి ఓ వీడియో చూపించాడు. అందులో రవి.. ప్రియతో మాట్లాడుతూ.. పెళ్లయిన వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ లహరి తన వెంటే పడుతుందని, యాంకరింగ్ కోసం బాగా ట్రై చేస్తుందని కొంచెం బ్యాడ్‌గా మాట్లాడాడు. ఈ విషయాన్నే నామినేషన్స్ సందర్భంగా ప్రియ ప్రస్తావించగా.. హౌస్‌లో పెద్ద దుమారమే రేగింది.