Breaking News

బిగ్‌బాస్-5: ఈ వారం మరో ముదురు బెండకాయ అవుట్..!!

1 0

బిగ్‌బాస్-5లో ఇకపై లవ్ ట్రాకులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముదురు బెండకాయలందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా బిగ్‌బాస్ నిర్వాహకుల ప్లాన్ ప్రకారమే జరుగుతోందని టాక్ నడుస్తోంది. తొలి వారం సరయూ ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది. ఇక మూడో వారంలో ఐదుగురు నామినేషన్‌లో ఉన్నారు. జాబితాలో మానస్, శ్రీరామ్, ప్రియ, ప్రియాంక, లహరి ఉన్నారు.

అయితే ఈ వారం ప్రియ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్‌లో అందరూ ప్రియ ఆంటీని టార్గెట్ చేసేశారు. ఆమె కూడా నోరు స్లిప్ అయి రవి, లహరిలపై ఆరోపణలు చేసింది. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ కావడం పక్కా అని తెలుస్తోంది. రానున్న వారాల్లో కూడా లోబో, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వరుసగా ఎలిమినేట్ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఇకపై హౌస్‌లో లవ్ ట్రాకులు మొదలు కానున్నాయి. ఇప్పటికే శ్రీరామ్-హమీదా, మానస్-లహరి మధ్య లవ్ నడుస్తుండగా.. త్వరలోనే షణ్ముఖ్-సిరి, సన్నీ-శ్వేత జత కడతారని టాక్. గత సీజన్‌లో అవినాష్-అరియానా తరహాలో ఈ సీజన్‌లో ఏ ప్రేమజంట ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి