Breaking News

చైతూతో విడాకుల వార్తలు.. బుద్ధి లేదా నీకు అని తిట్టిన సమంత

1 0

శనివారం ఉదయం అక్కినేని సమంత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంది. తన భర్త నాగచైతన్యతో కాకుండా సొంత స్టాఫ్‌తో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో వెంకటేశ్వరస్వామిని సమంత దర్శించుకుంది. దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకు రాగానే సమంతను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌ ‘మీ గురించి రూమర్స్‌ వస్తున్నాయి’ అంటూ సమంతను చైతూతో విడాకుల గురించి ప్రశ్నించాడు. జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడగడంపై హీరోయిన్ సమంత సీరియస్ అయ్యింది. గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి? అసలు నీకు బుద్ధి ఉందా అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దేవుడి దర్శనం కోసం వచ్చిన సమంతను వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.