Breaking News

బిగ్‌బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

1 0

తెలుగులో గత బిగ్‌బాస్ సీజన్‌ల కంటే ఈ సీజన్ భిన్నంగా సాగుతోంది. తొలి ఎపిసోడ్ నుంచే అరుపులు, కేకలు, కొట్లాటలు, బూతులు, ఏడుపులు, పెడబొబ్బలు.. అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది మన కంటెస్టెంట్ల యవ్వరాల గురించి. అందుకే ఈ సీజన్‌లో ఆశించిన రేటింగ్ రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మూడో వారానికి చేరబోతోంది. ఈ మేరకు హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ కాక తప్పదు.

ఈ వారం నామినేష‌న్‌లలో కాజల్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, అనీ మాస్టర్ ఉండ‌గా శ‌నివారం రోజు లోబో, అనీ మాస్ట‌ర్, ప్రియాంక సింగ్‌ల‌ని నాగార్జున సేవ్ చేశారు. మిగ‌తా ముగ్గురిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. తాజా స‌మాచారం మేర‌కు కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి ఎలిమినేట్ కానుంది. అంద‌రి కంటే ఉమాకే ఈ వారం ఓట్లు తక్కువ వచ్చాయని తెలుస్తోంది. అనీ మాస్టర్‌తో గొడవకు దిగి బూతులు మాట్లాడటం ఉమాదేవికి మైనస్‌గా మారిందని ఆమెకు వచ్చిన ఓట్లను బట్టి అర్ధమవుతోంది. కాగా శనివారం నాటి ఎపిసోడ్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్ హీరో రామ్‌చరణ్, మాస్ట్రో టీమ్ నితిన్, తమన్నా, నభానటేష్ బిగ్‌బాస్ వేదికపై సందడి చేశారు.