Breaking News

ఫ్రెష్ ఫీలింగ్ కలిగించిన ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్

1 0

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఫ్రెష్ ఫీలింగ్‌ను ఈ ట్రైలర్ కలిగించింది. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. రిక్షా వాడికి రిక్షా ఇచ్చినా, గొర్రెలు మేపుకునే వాడికి గొర్రెలు ఇచ్చినా వాళ్లు ఏం డెవలప్ అవుతారంటూ చైతూ చెప్పే డైలాగ్ ఆలోచింపచేసేలా ఉంది. ‘చదువు చదువే.. డ్యాన్స్.. డ్యాన్సే.. బిల్‌గేట్స్ ప్రభుదేవా దగ్గరకు వచ్చి జాబ్ అడిగితే దొబ్బేయమంటాడు’ అంటూ చైతూ చెప్పే డైలాగ్ నవ్విస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్సర్‌గా కనిపించబోతుంది. ట్రైలర్‌లో చైతూ, సాయి పల్లవి మధ్య డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా ట్రైలర్‌లో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఎంతో ప్రేక్షాకదరణ పొందిన సారంగదరియా సాంగ్‌ను ఈ ట్రైలర్‌లో చూపించలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.