మంగళవారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో హౌస్‌లో రచ్చ షురూ అయ్యింది. ముఖ్యం లహరి అందరి మీద నోరేసుకుని పడుతోంది. ఆమె ఏ హౌస్‌మేట్‌తోనూ నార్మల్‌గా మాట్లాడటం ఇప్పటివరకు కనిపించలేదు. ఉత్త పుణ్యానికి ఆర్జే కాజల్‌ను ఆమె ఏడిపించింది. కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి మాట్లాడుతుండగా మధ్యలో లహరి కల్పించుకుంది. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి.. అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని కాజల్‌కు చురకలు అంటించింది. దీంతో కాజల్ తనను తప్పుగా అర్ధం చేసుకుంటున్నావని.. ఒకవేళ తాను తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమాపణలు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్లి ఏడ్చేసింది. ఆమెను రవి ఓదార్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో పూలపాన్పులు ఉండవని.. ఇలాగే ఉంటారని నచ్చచెప్పాడు. లహరి బుధవారం కూడా హమీదాతో గొడవకు దిగినట్లు ప్రోమోలో చూపించారు. దీంతో లహరి ప్రవర్తన చూసిన అభిమానులు ఆమె ఎలిమినేషన్‌లో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు మంగళవారం ఎపిసోడ్‌లో అనీ మాస్టర్, జెస్సీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాత్రి పూట పలువురు హౌస్‌మేట్స్ కలిసి ముచ్చట్లు పెట్టుకున్న వేళ.. అక్కడ కొన్ని కుర్చీలు మాత్రమే ఉంటాయి. దీంతో సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమని జెస్సీ అంటాడు. హమీదా కుదరదు అని ఖరాకండిగా చెప్పడంతో సిరిని తన స్థానంలో కూర్చోమని జెస్సీ అంటాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. కొందరు హౌస్‌మేట్స్ వచ్చి ఈ గొడవను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. యాంకర్ రవి, లోబో వంటి వాళ్లు జెస్సీకి సలహాలు ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ చూశాక అనీ మాస్టర్ కూడా ఓవరాక్షన్ చేసినట్లు కనిపించింది. మున్ముందు ఆమె ఇలాగే ప్రవర్తిస్తే కొద్దిరోజుల్లోనే బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఖాయంగా కనపడుతోంది.