Breaking News

నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ రూమర్స్

3 0

ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ వార్త కుదిపేస్తోంది. అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి పలు కారణాలను చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఇటీవల తన పేరు నుంచి అక్కినేనిని తొలగించింది. మరోవైపు ఈనెల 29న జరిగిన హీరో నాగార్జున బర్త్ డే వేడుకల్లో కూడా సమంత కనిపించలేదు. నాగార్జునతో అక్కినేని అఖిల్, నాగచైతన్య, అమల వంటి వారే ఫోటోలలో కనిపించారు. సమంత కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే సమంత రాకపోవడానికి అసలు కారణం ప్రస్తుతం తమిళ సినిమా షూటింగ్‌లో భాగంగా తమిళనాడులో ఉందని… అందుకే మామ నాగార్జున బర్త్ డే కి సమంత హాజరు కాలేదని కొందరు వాదిస్తున్నారు. అయితే ట్విట్టర్ ద్వారా నాగార్జునకు కోడలు సమంత విషెస్ తెలిపిందన్న విషయం కొందరు మరిచిపోతున్నారు. ఏ మాయ చేశావె సినిమాతో నాగచైతన్య, సమంత కలుసుకోగా.. అప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మరి నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.