Breaking News

ప్రభాస్‌కు ఏమైంది? అతడు ఎందుకు ఇలా అయిపోయాడు?

0 0

టాలీవుడ్‌లో డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం. ప్రభాస్ చాలా అందగాడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి సినిమాలు అతడికి ఎంతో అభిమానులను సాధించిపెట్టాయి. ‘బాహుబలి’ సినిమా వల్ల అతడికి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో, ఆ సినిమా తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ , సలార్ అంటూ వరుసగా సినిమాలను ప్రభాస్ లైన్‌లో పెట్టాడు.

అయితే ఇటీవల ప్రభాస్ లుక్స్‌ను చూసిన అభిమానులు షాక్ తిన్నారు. ప్రభాస్ ముఖంలో ఆకర్షణ కోల్పోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా లావుగా కూడా ప్రభాస్ కనిపిస్తున్నాడు. సాధారణంగా గ్లామర్ ఫీల్డులో ఉండే వారు ఎంతో అందంగా కనిపిస్తారు. వయసు మళ్లుతున్నా నాగార్జున ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌లో ఛార్మింగ్ మిస్ అయ్యింది. ప్రభాస్ ప్రస్తుతం అంకుల్‌లా కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నార్త్‌లో అయితే ప్రభాస్ ఫోటోలను చూసి నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ దాదాపు 50 ఏళ్ల మేనమామలా కనిపిస్తాడని.. మేకప్ లేకుండా అతన్ని చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రభాస్ అంకుల్ మాదిరిగా కనిపిస్తున్నారని ఒకడు కామెంట్ చేస్తే.. మిల్క్ మ్యాన్‌లా ఉండాల్సిన వ్యక్తి ముసలివాడిలా అయ్యాడని మరొకడు ట్రోల్ చేశాడు.