Breaking News

‘లవ్‌స్టోరీ’ రిలీజ్ డేట్ పోస్టర్‌పై ట్రోల్స్.. మాములుగా లేవుగా..?

2 0

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ సినిమా రిలీజ్ డేట్‌ను ఈరోజు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ మూవీ విడుదలవుతుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఓ చోట పప్పులో కాలేశారు. వినాయకచవితి అని రాయాల్సింది వినకాయ చవితి అని రాశారు ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తిపోయాయి. మీమ్స్ రాయుళ్లు మాములుగా రచ్చ చేయలేదు. కాగా ఈ సినిమాలోని సారంగదరియా సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి పవన్ సంగీతం సమకూర్చాడు.