Breaking News

బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో తెలుసా?

0 0

బిగ్‌బాస్-5 ఐదో వారాంతానికి చేరింది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో ఏకంగా 9 మంది నామినేషన్‌లలో ఉన్నారు. వారిలో జెస్సీ, షణ్ముఖ్, రవి, ప్రియ, లోబో, సన్నీ, హమీదా, మానస్, విశ్వ ఉన్నారు. వీరిలో ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ కానుందనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వారం షణ్ముఖ్‌కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటంతో తిరుగులేని ఓట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇక మానస్, సన్నీ‌లు తరువాతి స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు సంపాదించారు. బిగ్ బాస్‌కు వచ్చి ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకున్న రవికి ఓ మోస్తరు ఓట్లు రావడం గమనార్హం. ఎలిమినేషన్స్ గండం నుంచి గట్టెక్కినా తన క్రేజ్‌కి తగ్గ ఓట్లను రాబట్టలేకపోతున్నాడు రవి. మిగిలిన వారిలో ప్రియ‌ ఫ్యాన్ బేస్ పెరగడంతో ఓట్లు బాగానే రాబట్టింది.