Breaking News

టాలీవుడ్‌లో సమ్మర్ ‘హౌస్‌ఫుల్’

1 0

గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వల్ల సినిమాల విడుదలలు ఆగిపోవడంతో ఈ ఏడాది టాలీవుడ్ డైరీ ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ మేరకు సమ్మర్‌ సీజన్ కళకళలాడబోతుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపుగా సమ్మర్‌కు క్యూ కట్టాయి. అందుకే తమ సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ముందుగానే రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, విజయ్ దేవరకొండ, నితిన్, రవితేజ, గోపీచంద్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, నాని.. ఇలా స్టార్ హీరోలందరూ సమ్మర్‌లో వస్తుండటంతో సమ్మర్ సీజన్ ‘హౌస్‌ఫుల్‌’గా కనపడుతోంది. అయితే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, నాగార్జున ‘వైల్డ్ డాగ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, నాగశౌర్య ‘లక్ష్య’, కమల్ ‘భారతీయుడు-2’ సినిమాల విడుదల తేదీలు ఇప్పటివరకు ప్రకటించకపోయినా వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాగా ఏ ఏ సినిమాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయో సమగ్ర సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

మార్చి 11: గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం
మార్చి 19: చావు కబురు చల్లగా
మార్చి 26: రంగ్ దే, అరణ్య, గుడ్ లక్ సఖి
ఏప్రిల్ 2: సిటీ మార్, సుల్తాన్ (కార్తీ)
ఏప్రిల్ 9: వకీల్ సాబ్
ఏప్రిల్ 16: లవ్ స్టోరీ
ఏప్రిల్ 23: టక్ జగదీష్ (పోస్ట్ పోన్)
ఏప్రిల్ 29: రాధే శ్యామ్ (అవకాశం)
ఏప్రిల్ 30: విరాట పర్వం
మే 7: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (అవకాశం)
మే 13: ఆచార్య
మే 14: నారప్ప
మే 21: వైల్డ్ డాగ్ (అవకాశం)
మే 22: లైగర్ (అవకాశం)
మే 28: BB3, ఖిలాడీ
జూన్ 4: రిపబ్లిక్