తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో సీఎం పీఆర్వో విజయ్‌ను తొలగిస్తూ సీఎంవో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా విజయ్‌ను తొలగించినట్లు సమాచారం. అవినీతికి పాల్పడినా, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినా వేటు తప్పదని సీఎంవో కార్యాలయం సంకేతాలను ఇచ్చింది. కాగా వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు విజయ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
తనకు అవకాశం ఇచ్చి, గొప్ప పొజిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తనకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఆయన ఎందుకు అకస్మాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

