Breaking News

ఒకేరోజు ఓటీటీలోకి పెద్ది, సింగ్ గీతం

1 0

ఓటీటీలోకి వారం వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ వారం రెండు క్రేజీ సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీతో పాటు నాగ్ అశ్విన్ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు నుంచి (జూలై 9) నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్నాయి. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించిన మూవీ ‘పెద్ది’. క్రీడలు, దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ జూన్ 4న విడుదలై మంచి వసూళ్లను సాధించింది. జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చాడు. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. వీకెండ్‌లో పలు చోట్ల మంచి వసూళ్లను కూడా అందుకుంటోంది.

మరోవైపు సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ప్రయోగాత్మక మ్యూజికల్ ఫాంటసీ చిత్రం సింగ్ గీతంలో అయాన్, అహల్య, షాలిని ప్రధాన పాత్రలు పోషించారు. తండ్రి ఆస్తుల కోసం కుబేరపురం అనే మైనింగ్ టౌన్‌కు వెళ్లిన కథానాయకుడు, అక్కడ మాటలు పాటలుగా మారే ఓ విచిత్రమైన శాపం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. విజయ్ దేవరకొండ, కేవీ అనుదీప్, రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఓటీటీ వెర్షన్ కోసం క్లైమాక్స్ విజువల్స్‌ను మరింత మెరుగుపరిచారని ప్రచారం జరుగుతోంది.