పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఒకేతాటిపైకి వచ్చి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారని.. ఇప్పుడు మరోసారి ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్ క్రైసిస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తుతుందని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్బరతతో ఈ విపత్తును ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. దీని కోసం కేంద్రం ఎప్పటికప్పుడు ప్రజల కోసం తమ వంతుగా పాటు పడుతుందని అన్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాగా మోదీ ప్రకటనతో దేశ ప్రజలు ఆందోళన పడుతున్నారు. మరోసారి లాక్ డౌన్ లాంటి విపత్తులు ఎదుర్కొవాలా అంటూ టెన్షన్‌కు గురవుతున్నారు. నిత్యావసరాల కొరత, గ్యాస్, పెట్రోల్ కొరత, రోడ్ల మీద నిర్మానుష్య పరిస్థితులు నెలకొంటుండటంతో జనాలు భయపడిపోతున్నారు.
