ప్రముఖ దర్శకుడు దేవ్‌కట్టా నుంచి వస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ పోషించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. యువ మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు లీడర్స్ మధ్య మొదలైన రాజకీయ ఆట ఎలా మారింది అన్నదే ఈ సిరీస్ కథ. ఆగస్టు 7 నుంచి సోనీలివ్ ఓటీటీ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ ఈవెంట్‌లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. దేవా కట్టాతో తనది పదేళ్ల జర్నీ అని తెలిపారు. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవాకు ఫోన్ చేసి మాట్లాడానని.. అప్పటి నుంచి తమ ప్రయాణం మొదలైందని వెల్లడించారు. అలా ఆ ప్రయాణం నుంచి ‘రిపబ్లిక్’ వచ్చిందన్నారు. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో తనకు ఎప్పుడూ అండగా నిలిచారని… ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా కోసం ఈ ఈవెంట్‌కు రావడం జరిగిందని సాయితేజ్ పేర్కొన్నారు.
